పిల్లల దత్తతకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jul 20 , 2024 | 12:09 AM
బాలల రక్షిత గృహాల్లో (అనాథ ఆశ్రమా లు) ఉంటున్న పిల్లల దత్తతకు దరఖాస్తులు ఆహ్వానిస్తన్న ట్టు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శాంతిశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కలెక్టరేట్: బాలల రక్షిత గృహాల్లో (అనాథ ఆశ్రమా లు) ఉంటున్న పిల్లల దత్తతకు దరఖాస్తులు ఆహ్వానిస్తన్న ట్టు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శాంతిశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హ త ఉన్నవారు ఫోస్టర్ కేర్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసు కోవాలన్నారు. పిల్లలను రెండేళ్ల పాటు సంరక్షణ చేసిన అనంతరం పెంపుడు తల్లిదండ్రులకు చట్టప్రకారం దత్తత తీసుకోవచ్చని తెలిపారు. తల్లిదండ్రుల వయస్సు 35 సం వత్సరాలు దాటి ఉండాలని, 6 నుంచి 12, 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలను తీసుకోవాల్సి ఉంటుందన్నా రు. పూర్తి వివరాలకు జిల్లా బాలల రక్షణాధికారి ఫోన్ నెంబరు 94400 34476 లేకుంటే స్థానిక 80 అడుగుల రోడ్డు, వాంబే కాలనీ వద్ద గల తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.