Share News

కొలిక్కివచ్చిన గ్రానైట్‌ పర్మిట్ల జారీ

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:38 PM

నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమకు ఎట్టకేలకు పర్మిట్ల జారీ అంశం కొలిక్కివచ్చింది. 110 రోజులుగా పర్మిట్లు జారీ లేక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ‘ఆంరఽధజ్యోతి’ వరుస కథనా లతో పాటు గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్‌, తమిళనాడు మోర్నమెంట్‌ ఫ్యాక్టరీస్‌ ప్రతినిధులు ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

కొలిక్కివచ్చిన గ్రానైట్‌ పర్మిట్ల జారీ
మంత్రి లోకేష్‌ను కలిసిన రాష్ట్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహేష్‌

- ‘విశ్వసముద్ర’ నుంచి ఏఎంఆర్‌ సంస్థకు బదిలీ

- సోమవారం నుంచి ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభం

- ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో మైన్స్‌శాఖలో చలనం

(టెక్కలి)

నీలిరంగు గ్రానైట్‌ పరిశ్రమకు ఎట్టకేలకు పర్మిట్ల జారీ అంశం కొలిక్కివచ్చింది. 110 రోజులుగా పర్మిట్లు జారీ లేక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ‘ఆంరఽధజ్యోతి’ వరుస కథనా లతో పాటు గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్‌, తమిళనాడు మోర్నమెంట్‌ ఫ్యాక్టరీస్‌ ప్రతినిధులు ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాజా గా మంత్రి లోకేష్‌ను కలిసి సమస్య వివరించారు. దీంతో సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో పర్మిట్లు జారీకి మార్గం సుగమమైంది. 2025 మార్చి 31 వరకు నెలకు రూ.12.85 కోట్లకు టెండర్లు దక్కిం చుకున్న విశ్వసముద్ర సంస్థను రాష్ట్ర ప్రభుత్వం.. సాంకేతిక కారణాలను పక్కనపెట్టి ఎ.మహే శ్వరరెడ్డి(ఏఎంఆర్‌) సంస్థకు పర్మిట్ల జారీ బాధ్యత అప్పగించింది. ఆఫ్‌లైన్‌ పర్మిట్ల నుంచి ఆన్‌ లైన్‌లోకి మార్చడం, సాంకేతిక సమస్యలు, సంబంధిత కాంట్రాక్టర్‌ పెండింగ్‌ బకాయిలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏఎంఆర్‌ సంస్థ గుంటూరు జిల్లాలో గనులశాఖ పర్మిట్లు జారీ చేస్తోంది. ఇకనుంచి శ్రీకాకుళం జిల్లాతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం, విజయనగరం జిల్లాల పర్మిట్ల జారీ బాధ్యత కూడా ఈ సంస్థకు అప్పగించారు. అందులో భాగంగా శుక్రవారం చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఏఎంఆర్‌ సంస్థ తరపున మైన్స్‌ అధికారులు పర్మిట్లు జారీచేశారు. శ్రీకాకుళంలో మాత్రం జారీకాకపోవడంతో గ్రానైట్‌ యజమా నులు ఆందోళనకు గురయ్యారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్‌ మంత్రి లోకేష్‌ను కలిసి సమస్యను వివరించడంతో సోమవారం నుంచి జిల్లాలో పర్మిట్ల జారీకి అవకాశం లభించింది. ఈ విషయమై గనులశాఖ డీడీ ఎస్‌కేవీ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా తమకు అధికారిక ఉత్త ర్వులు రాలేదు.. కానీ సోమవారం నుంచి గ్రానైట్‌ పర్మిట్లు ఆన్‌లైన్‌లో జారీచేస్తామని తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 11:38 PM