Share News

ఇది ప్రజా ప్రభుత్వం

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:43 PM

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

ఇది ప్రజా ప్రభుత్వం
పాతపట్నం: కరపత్రాలు ప్రదర్శిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట

- నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరన్నపేట/ జలుమూరు/ జలుమూరు (సారవకోట): అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం కోమర్తి, కరవంజ, గుమ్మలపాడు గ్రామాల్లో 100 రోజుల పాలనపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి కాక ముందే ప్రజలకు దగ్గరయ్యామని, దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అంద జేస్తామన్నారు. దాచుకోవడం దోచుకోవడం మాత్రమే తెలిసిన వైసీపీ నాయకులు ఇదేళ్లలో తీసుకురాలేని సంస్కరణలను చంద్రబాబు 100 రోజుల్లోనే తీసుకొచ్చారని కొనియాడారు. కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన నేతలు శిమ్మ చంద్రశేఖర్‌, గొద్దు చిట్టిబాబు, బలగ ప్రవీణ్‌, వెలమల రాజేంద్రనాయుడు, బగ్గు గోవిందరావు, కత్తిరి వెంకటరమణ, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, ధర్మాన తేజకుమార్‌, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..

- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి: ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయం ఎదురుగా గల ఏపీహెచ్‌బీ కాలనీ, కార్గిల్‌ విక్టరీ పార్కు వద్ద ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వందరోజుల పాలన అదుర్స్‌

- పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు

మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన అదుర్స్‌ అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శుక్రవారం చాపరలో ఇది మం చి ప్రభుత్వం కార్యక్రమం నిర్వ హించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామ న్నారు. నిరుద్యోగుల కు డీఎస్సీ, వృద్ధులకు పింఛన్‌ పెంపు అమ లు చేసిందని, దీపా వళి నుంచి ఉచిత గ్యాస్‌ అందిస్తు న్నా మన్నారు. వైసీపీ ప్ర భుత్వంలో వందరో జుల్లో విధ్వంసం చేయగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి చేసి చూపించిందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఎల్‌.మధు బాబు, తహసీల్దార్‌ హనుమంతురావు, ఎంపీడీవో చంద్రకుమారి, టీడీపీ నాయకులు సలాన మోహన రావు, బీజేపీ నాయకులు శరత్‌, పైల బాజ్జి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల కళ్లల్లో ఆనందం: కలమట

పాతపట్నం: వందరోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి అన్నారు. పాతపట్నంలో శుక్రవారం రాత్రి 100 రోజుల మంచి పాలన కార్యక్రమం నిర్వహించారు. కరపత్రా లను ప్రదర్శించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

శతశాతం హామీల అమలే చంద్రన్న లక్ష్యం

- ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస: ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని హడ్కో కాలనీ వెంకయ్యపేట ప్రాంతాల్లో రాష్ట్రంలో వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో వార్డులో టీడీపీ ఇన్‌చార్జి నాగళ్ల మురళీధర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రవికుమార్‌ మాట్లాడారు. రాష్ట్రాన్ని ఓ వైపు అభివృద్ధి బాటలో నడపడంతోపాటు అప్పుల బాధల నుంచి కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న దార్శినికుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టమన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పీరుకట్ల విశ్వప్రసాద్‌, ఆనెపు రామకృష్ణనాయుడు, తమ్మినేని గీతాసాగర్‌, రాజు, ఢిల్లేశ్వరరావు, భాస్కరరావు, చంద్రశేఖర్‌, రామ్మోహన్‌, సూరపునాయుడు, ఎన్ని శ్రీదేవి పాల్గొన్నారు.

100 రోజుల్లో ఎంతో అభివృద్ధి

- ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎచ్చెర్ల: కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. కుప్పిలి గ్రామంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రద్దు, సామాజిక పింఛన్‌ పెంపు తదితర కార్యక్రమాలతో అన్ని వర్గాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చౌదరి నారాయణమూర్తి, పైడి వేణుగోపాలం, విశ్వక్సేన్‌, బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ స్టిక్కర్లు అతికించి... 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.

Updated Date - Sep 20 , 2024 | 11:43 PM