Share News

road accident రోడ్డు ప్రమాదంలో గాయపడిన జోగయ్య మృతి

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:20 AM

road accident పాతపట్నం మండలంలోని కొరసవాడ వద్ద ఎమ్మెల్యే గోవిందరావు తనయుడి వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో గాయపడిన భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన సీహెచ్‌ జోగయ్య చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు.

road accident  రోడ్డు ప్రమాదంలో గాయపడిన జోగయ్య మృతి

శ్రీకాకుళం క్రైమ్‌/పాతపట్నం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పాతపట్నం మండలంలోని కొరసవాడ వద్ద ఎమ్మెల్యే గోవిందరావు తనయుడి వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో గాయపడిన భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన సీహెచ్‌ జోగయ్య చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఎస్‌ఐ లావణ్య కథనం మేరకు.. పాతపట్నం మండలంలోని కొరసవాడ వద్ద ఈనెల 21న ఆటోను కారు ఢీకొన్న ఘటనలో భామిని మండలానికి చెందిన సీహెచ్‌ జోగయ్య తో పాటు మరో నలుగురు తీవ్ర గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స కోసం చేర్పించారు. అయితే వీరిలో జోగయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రిమ్స్‌ నుంచి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసు పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. పాతపట్నం సీఐ రామారావు, ఎస్‌ఐ లావణ్య ఆసుపత్రికి చేరుకు న్నారు. జోగయ్య కుటుంబ సభ్యుల వద్ద రిపోర్టు తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

Updated Date - Dec 25 , 2024 | 12:20 AM