నోరు అదుపులో పెట్టుకోవాలి
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:32 PM
వైసీపీ నాయకుడు బూర్లె శ్రీను నోరు అదుపులో పెట్టుకోకుంటే రానున్నరోజుల్లో తగిన గుణపాఠం తప్పదని కొత్తూరు మండల టీడీపీ నాయకులు హెచ్చరించారు.
పాతపట్నం/కొత్తూరు: వైసీపీ నాయకుడు బూర్లె శ్రీను నోరు అదుపులో పెట్టుకోకుంటే రానున్నరోజుల్లో తగిన గుణపాఠం తప్పదని కొత్తూరు మండల టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవిం చకతప్పదని తెలిపారు.ఆదివారం కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్-1లో నిర్వాసితగ్రామ సర్పంచ్‌లు, టీడీపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. అర్హులైన నిర్వాసితుల పొట్టకొట్టి ప్రజాధనాన్ని లూటీ చేసిన దుర్మార్గుడు బూర్లె శ్రీనని తెలిపారు.బూర్లె శ్రీనును ప్రభుత్వకార్యాలయాలకు రాకుండా అడ్డుకోవాలని కోరారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ భూములను తప్పుడుపట్టాలు చేసుకొన్న అవినీతి పరుడు తెలిపారు. అప్పట్లో కోట్లాది రూపాయల ప్రభుత్వధనాన్ని అవినీతికిపాల్పడి దోచుకున్నాడని ఆరోపించారు. నిరుపేద నిర్వాసితుల పొట్టకొట్టి ప్యాకేజీలు దోచుకున్న గజదొంగ అని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాసితగ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు అడపాక శంకరరావు, కొయిలాపు శ్రీనివాసరావు, బర్రి గోవింద రావు, రౌతు అనంతరావు, అగతముడి మాధవరావు, మాతల గాంధీ, ఆరుబోలు దశరధ, వాలి పిల్లి వెంకట రమణ, పెద్దిన అమర్, చోడవ రపు రాము, కృష్ణ, తిరుపతిరావు పాల్గొన్నారు.