ఎయిడ్స్‌ను తరిమి కొడదాం..
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:25 AM
హెచ్‌ఐవీ-ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొడదామని కొళిగాం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నరేంద్రనాథ్ పట్నాయిక్ అన్నారు.
ఇచ్ఛాపురం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ-ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొడదామని కొళిగాం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నరేంద్రనాథ్ పట్నాయిక్ అన్నారు. శనివారం పాఠశాల విద్యార్థులచే ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అ నంతరం పాఠశాల మైదానంలో విద్యార్థులచే ఎయిడ్స్ గుర్తు ఆకా రంలో కూర్చొని అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు శ్రీనివా స్, పద్మావతి, అమిత, చంద్రవదన్ తదితరులు పాల్గొన్నారు.
- సోంపేట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఎయిడ్‌సపై అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ప్ల కార్డులతో ప్రదర్శన చేశారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్ ఎ.మోహనరావు, అధ్యాపకులు పి.రజనీ కుమారి, ఎ.రామినాయుడు, ఎం.ప్రసాద్. టి.యుగంధర్, సంధ్యా రాణి తదితరులు పాల్గొన్నారు.