లారీ డ్రైవర్ల నిరసన
ABN , Publish Date - Jan 01 , 2024 | 11:37 PM
కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లారీ డ్రైవర్లు కొర్లాం వద్ద జాతీయ రహదారిపై సోమవారం నిరసన తెలిపారు.
సోంపేట: కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లారీ డ్రైవర్లు కొర్లాం వద్ద జాతీయ రహదారిపై సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాన్ని వెనక్కు తీసుకొవాలని కోరారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగితే రూ.10లక్షలు జరిమానా, జైలుశిక్ష విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కాగా డ్రైవర్ల నిరసనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.