Share News

నిర్వహణ లేక.. నిరుపయోగం

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:12 AM

కవిటి పంచాయతీ కార్యాలయానికి సమీపంలో చెత్తసేకరణ వాహనం నిర్వహించకుండా నిరుపయోగంగా విడిచిపెట్టారు. గత ప్రభుత్వం పంచాయతీలో చెత్త సేకరించి సంపద కేంద్రానికి తరలించాలన్న ఉద్దేశంతో వాహనాన్నిసమకూర్చింది

నిర్వహణ లేక.. నిరుపయోగం
కవిటిలో మూలకుచేరిన చెత్త సేకరణ వాహనం

కవిటి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కవిటి పంచాయతీ కార్యాలయానికి సమీపంలో చెత్తసేకరణ వాహనం నిర్వహించకుండా నిరుపయోగంగా విడిచిపెట్టారు. గత ప్రభుత్వం పంచాయతీలో చెత్త సేకరించి సంపద కేంద్రానికి తరలించాలన్న ఉద్దేశంతో వాహనాన్నిసమకూర్చింది. ఈవాహనం తడి,పొడి చెత్తసేకరణకు వినియోగించకపోవ డంతో తుప్పుపడుతోంది. నెలల తరబడి తుప్పలు, మట్టి పక్కన పార్కింగ్‌ చేయడంతో టైర్లు కూడా పాడవుతున్నాయి. పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఖాళీ ప్రదే శంలో వాహనం నెలల తరబడి ఉండడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయిఉంది. తక్షణ మే పంచాయతీ అధికారులు చెత్తసేకరణకోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొను గోలు చేసిన వాహనం వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:12 AM