అర్ధ శతాబ్ది సదస్సు విజయవంతం చేయండి
ABN , Publish Date - Jun 18 , 2024 | 12:14 AM
తెలుగు రాష్ట్రాల్లో గత 50 ఏళ్లుగా ఉద్యమ మార్గాన్ని ఎంచుకుని పోరాటం చేస్తున్న ప్రగతిశీల మహిళా సంఘం అర్థ శతాబ్ది ముగింపు సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షురాలు సవలాపురపు కృష్ణవేణి పిలుపునిచ్చారు.
- ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి
అరసవల్లి: తెలుగు రాష్ట్రాల్లో గత 50 ఏళ్లుగా ఉద్యమ మార్గాన్ని ఎంచుకుని పోరాటం చేస్తున్న ప్రగతిశీల మహిళా సంఘం అర్థ శతాబ్ది ముగింపు సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షురాలు సవలాపురపు కృష్ణవేణి పిలుపునిచ్చారు. జూన్ 22వ తేదీ శనివారం ఉదయం 10.00 గంటలకు విశాఖలోని బీవీకే కాలేజీకి ఎదురుగా ఉన్న పౌర గ్రంథాలయంలో ప్రారంభం కానున్న సదస్సుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దపాడు దరి తంగివాని పేటలో పీవోడబ్ల్యూ కార్యకర్తలతో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రజా సంఘాల నాయకుల సందేశాలు ఉంటాయని, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పీవోడబ్ల్యూ అంతిమ లక్ష్యం స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనని, అందుకు రాజీలేని పోరాటమే మార్గమన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ కార్యకర్తలు దివ్వల లక్ష్మి, ఎస్.లక్ష్మి, రజని, సుజాత, కురమాన అప్పమ్మ, అప్పలనర్సమ్మ, పోలాకి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేపట్టారు.