Share News

Manmohan Singh's death మన్మోహన్‌ సింగ్‌ మృతి తీరని లోటు

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:29 PM

Manmohan Singh's death మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి తీరని లోటని పలువురు నేతలు అన్నారు. ఆయన చిత్రపటాల వద్ద శుక్రవారం నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు.

Manmohan Singh's death  మన్మోహన్‌ సింగ్‌ మృతి తీరని లోటు
పలాస: మన్మోహన్‌సింగ్‌ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష, టీడీపీ నాయకులు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి తీరని లోటని పలువురు నేతలు అన్నారు. ఆయన చిత్రపటాల వద్ద శుక్రవారం నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌సింగ్‌

పలాస, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధానిడా.మన్మోహన్‌సింగ్‌ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పార్టీ కార్యాలయంలో మన్మోహన్‌ సింగ్‌ చిత్రపటానికిపైలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక సరళీకృత విధానం అమలుతో పాటు హక్కులతో కూడిన సంక్షేమం భారతీయుల జీవితాలను మార్చిందని గుర్తు చేశారు. ఆర్బీఐ గవర్నర్‌గా విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తి మన్మోహన్‌ అని, ఆయన మృతి దేశా నికి తీరనిలోటన్నారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ నేత లు పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, సప్ప నవీన్‌, మల్లా శ్రీనివాస్‌, డొక్కరి శంకర్‌, నాబిలి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

దేశానికి తీరనిలోటు

నరసన్నపేట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని డా. మన్మోహన్‌సింగ్‌ మృతి దేశానికి తీరని లోటని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అని అన్నారు. దేశం ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయిందన్నారు.

దేశం ఓ ధ్రువతారను కోల్పోయింది

టెక్కలి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతితో దేశం ఓ ధ్రువతారను కోల్పోయిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి అన్నారు. 2009-14 సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు తనకు మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని, ఆయన మృతి కాంగ్రెస్‌ పార్టీకి కూడా తీరని లోటన్నారు. 2008 సెప్టెంబరు 5న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకునే సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌ను కలవడం తన అదృష్టమని, ఆయన మృతి తీరని లోటని జాతీయ ఉత్తమ ఉపా ధ్యాయ అవార్డు గ్రహీత డీఏ స్టాలిన్‌ తన జ్ఞాపకాన్ని నెమరువేసుకుని నివాళి అర్పించారు.

Updated Date - Dec 27 , 2024 | 11:29 PM