Share News

శ్రీకూర్మంలో ఒకరి హత్య

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:15 AM

శ్రీకూర్మం గ్రామంలో శుక్రవారం రాత్రి ఉప్పాడ రాజేష్‌(37) హత్యకు గురవ్వగా, చుక్క రాము అనే వ్యక్తి గాయపడ్డాడు. గాయ పడిన వ్యక్తికి 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

శ్రీకూర్మంలో ఒకరి హత్య

గార, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మం గ్రామంలో శుక్రవారం రాత్రి ఉప్పాడ రాజేష్‌(37) హత్యకు గురవ్వగా, చుక్క రాము అనే వ్యక్తి గాయపడ్డాడు. గాయ పడిన వ్యక్తికి 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. శ్రీకూర్మం హైస్కూల్‌ సమీపంలో రాజేష్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, కత్తుల తో దాడిచేయగా, అతడు అక్కడికక్కడే మరణించాడు. అతడి పక్కనే ఉన్న చుక్క రాము గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న గార ఎస్‌ఐ ఆర్‌.జనార్దన రావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భూ వివాదాలే ఈ హత్యకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనతో శ్రీకూర్మం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
కోటబొమ్మాళి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
చలమయ్యపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుంచి అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. మినీ వ్యాన్‌లో నాలుగు ఆవులు, ఐదు దూడలను తరలి స్తుండగా తనిఖీ చేసి వ్యాన్‌ డ్రైవర్‌ బడ్డి సింహా చలం, పశువుల వ్యాపారి రావాడ శంకరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారా యణ తెలిపారు. పశువులను విశాఖపట్నం జిల్లా కొత్తవలస గోశాలకు తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ట్రాక్టర్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటబొమ్మాళి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి):
లఖందిడ్డి పంచాయతీ తలగానిపేట గ్రామానికి చెందిన వడిసి గోపి (34) ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతి చెందాడు. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శుక్ర వారం సాయంత్రం పొలం పనుల్లో భాగంగా ట్రాక్టర్‌కు రోటావేటర్‌ అమర్చే సమయంలో స్టార్‌ అయి ఉన్న ట్రాక్టర్‌ గేర్‌ పడి బోల్తాపడింది. దీంతో ఆ ట్రాక్టర్‌ కింద ఇరుక్కుపోయిన గోపి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెద్ద దిక్కు మృతితో కుటుంబం రోడ్డునపడిందని బంధువులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Dec 07 , 2024 | 12:15 AM