Share News

ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:23 AM

జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరింప చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించాలి: కలెక్టర్‌
ఉత్పత్తులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 14(ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరింప చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. పంటల సాగు, ఉత్పత్తుల విస్తీర్ణం, ఆదాయం మరింత పెరగాలని సంబంధిత జిల్లా అధికా రులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన సమావేశంలో ఆయన ఆదే శించారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులపై ప్రజ లకు మరింత అవగాహన అవసర మని, ప్రకృతి వ్యవసాయంపై మక్కు వ చూపేలా రైతులను ప్రోత్స హించాల న్నారు. సమావేశంలో ఉద్యానవన అధి కారి వరప్రసాద్‌, వ్యవసాయాధికారి త్రినాథ స్వామి, మార్కెటింగ్‌ ఏడీ రవికుమార్‌, రైతులు, వ్యాపా రులు పాల్గొన్నారు. అలాగే స్వీప్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ కొమ్ము రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ పర్యవేక్షణలో బాలల హక్కుల వారోత్స వాల పోస్టర్‌ను కలెక్టర్‌ గురువారం ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో సురంగి మోహనరావు, వావిలప ల్లి జగన్నాథం, చింతాడ కృష్ణమోహన్‌, జామి భీమశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:23 AM