పాలిటెక్నిక్ కోర్సులకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్
ABN , Publish Date - May 30 , 2024 | 11:29 PM
ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం)లోని కంప్యూటర్, ఫార్మసీ కోర్సులకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్ సాధించిందని ప్రిన్సిపాల్ జి.గోవిందనాయుడు తెలిపారు.
ఎచ్చెర్ల: ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల (శ్రీకాకుళం)లోని కంప్యూటర్, ఫార్మసీ కోర్సులకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్ సాధించిందని ప్రిన్సిపాల్ జి.గోవిందనాయుడు తెలిపారు. ఈ రెండు బ్రాంచ్‌లకు 2024-27 వరకు మూడేళ్ల పాటు అక్రిడేషన్ ల భించినట్టు చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్‌బీఏ బృందాలు కళాశాలను, వివిధ విభాగాల పనితీరును పరిశీలించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫార్మసీ బ్రాంచికి ఎన్‌బీఏ సాధించిన మొదటి కళాశాల తమదేనని పేర్కొన్నారు. ఎన్‌బీఏ అక్రిడేషన్ కోసం కృషిచేసిన ఫార్మసీ, కంప్యూటర్స్ విభాగా ధిపతులు డాక్టర్ ఆర్డీఎల్పీ క్రిస్టియన్, బి.నర్శింహమూర్తిలను ఆయన అభినందిం చారు. అలాగే క్యాంపస్ డ్రైవ్‌లో ఈ కళాశాల విద్యార్థినులు అధిక సంఖ్యలో ఉద్యో గాలు సాధించారన్నారు. డిప్లమో అర్హతతో రూ.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఇక్కడి వి ద్యార్థినులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. ఈ కళాశాలలో కంప్యూ టర్స్‌లో 60, ఫార్మసీలో 40, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోర్సులో 30 సీట్లు ఉన్నట్టు వివరించారు.