రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:10 AM
రైతులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు.
కాశీబుగ్గ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాల ఐక్య వేదిక నాయకులు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాల జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు, కార్మిక సంఘాల నాయ కులు వేణుగోపాల్, గణపతి, రామారావు, బాలకృష్ణ, వినోద్, అజయ్, దుర్యోధన మాట్లాడుతూ.. పీఎం మోదీ ఇచ్చిన హామీ మేరకు రైతు పండించిన అన్ని పంట లకు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, అందుకోసం స్వామినాఽథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న రైతులపై నిర్బంధం ప్రయోగించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బాలాజీరావు, అప్పయ్య, రవి, గోవింద్, జగన్, నాగేశ్వరరావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.