Share News

pensions ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:51 PM

pensions ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే మంగళవారం చేపట్టారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌, ఎమ్మెల్యేలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

 pensions  ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
పాతపట్నం: లబ్ధిదారులకు పింఛన్‌ అందిస్తున్నన కలెక్టర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గోవిందరావు

పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా?

లబ్ధిదారులను ప్రశ్నించిన కలెక్టర్‌

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ఈ నెల ఒకరోజు ముందుగానే మంగళవారం చేపట్టారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌, ఎమ్మెల్యేలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

పాతపట్నం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ లబ్ధిదారులను ప్రశ్నించారు. కొరసవాడ గ్రామం మొర్రివీధిలో మంగళవారం పింఛన్ల పంపిణీ ప్రక్రియను ఎమ్మె ల్యే మామిడి గోవిందరావుతో కలిసి పరిశీలించారు. అధికారులు ఇంటికి వచ్చి పింఛన్‌ ఇస్తున్నారా, పింఛన్లలో ఏమైనా చేతి వాటం ప్రదర్శిస్తున్నారా అని ప్రశ్నించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే గోవిందరావు ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని కోరా రు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎన్‌.కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో పి.చంద్ర కుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ, కార్యదర్శి మడ్డు రామా రావు, చేనేత కార్మిక నాయకుడు మంచు కృష్ణారావు తదితరులు పాల్గొ న్నారు. అలాగే వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:51 PM