వన్ డిస్ట్రిక్ట్ వన్ అవార్డు అందుకున్న కలెక్టర్
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:16 PM
కేంద్రప్రభుత్వం ప్రకటించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ అవార్డుల్లో భాగంగా పొందూరు కాటన్ చీరకు అవార్డు దక్కింది.
కలెక్టరేట్, జనవరి 3 : కేంద్రప్రభుత్వం ప్రకటించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ అవార్డుల్లో భాగంగా పొందూరు కాటన్ చీరకు అవార్డు దక్కింది. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఏడీఓపీ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్, వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.