Share News

పోలీసు స్టేషన్లలో ‘ఓపెన్‌ హౌస్‌’

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:39 PM

యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసకావడం వల్ల జీవితాలు నాశనమైపోతాయని ఒన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఓపెన్‌హౌస్‌ కార్యక్రమంలో భాగంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ-2 కృష్ణారావు,రైటర్‌ రవి పాల్గొన్నారు.

 పోలీసు స్టేషన్లలో ‘ఓపెన్‌ హౌస్‌’
గార: పోలీసుల విధులపై అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ జనార్దనరావు :

శ్రీకాకుళం క్రైం,అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసకావడం వల్ల జీవితాలు నాశనమైపోతాయని ఒన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఓపెన్‌హౌస్‌ కార్యక్రమంలో భాగంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ-2 కృష్ణారావు,రైటర్‌ రవి పాల్గొన్నారు. కాగా శ్రీకాకుళం రూరల్‌ స్టేషన్‌లో సర్కిల్‌ సీఐ కె.పైడపునాయుడు, ఎస్‌ఐ రాము, టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్‌ఐ సంతోష్‌లు.. ఓపెన్‌ హౌస్‌లో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఫ గార, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): గార పోలీసు స్టేషన్‌లో అమర వీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని మంగళవా రం ఓపెన్‌ పోలీస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాలల విద్యార్ధులకు పోలీస్‌స్టేషన్‌ నిర్వహణ, నేరాలు నియంత్రణ ట్రాఫిక్‌ నిబంధనలు, దొంగతనాల్లో శిక్షలు, శాంతి భద్రతలు పరిరక్షణపై ఎస్‌ఐ ఆర్‌.జనార్దనరావు విద్యార్ధులకు అవగాహన కల్పించారు.

ఫ జి.సిగడాం, అక్టోబరు 22(అంధ్రజ్యోతి): విద్యార్ధులు చెడు అలవా ట్లకు దూరంగా ఉండాలని జేఆర్‌పురం సీఐ అవతారం కోరారు. జి.సిగడాం ఆదర్శపాఠశాలలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కేజీబీవీలో ఇంటర్‌ విద్యార్థుల అదృశ్యంపై ఆరా తీశారు. పాఠశాల ప్రత్యేకా ధికారి, సిబ్బందికి సమాచారంఅడిగితెలుసుకున్నారు.ఆయన వెంట ఎస్‌ఐ మధుసూదనరావు ఉన్నారు.

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

శ్రీకాకుళం క్రైం: పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉం టామని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. అమ రవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా నక్సల్స్‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పి.కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను శ్రీకాకుళంలోని వారి నివాసంలో మం గళవారం కలుసుకున్నారు. కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులులర్పించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:39 PM