దేశవ్యాప్త ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొనండి
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:58 PM
ఆర్‌బీఐ స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులంతా పాల్గొ నాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు.
కలెక్టరేట్: ఆర్‌బీఐ స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులంతా పాల్గొ నాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఒక కళాశాల నుంచి ఎంతమంది విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇద్దరు విద్యార్థులు ఒక టీమ్‌గా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 17వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.2లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1.5లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష ఉంటుందని, జోనల్ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5 లక్షలు, రెండో బహుమతి రూ.4లక్షలు, మూడో బహుమతి రూ.3 లక్షలు ఉంటుందని, అలాగే జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.10లక్షలు, ద్వితీయ బహుమతి రూ.8లక్షలు, తృతీయ బహుమతి రూ.6లక్షలు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని డిగ్రీ చదువుతున్న విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.
13 నుంచి జిల్లా స్కూల్‌గేమ్స్‌కు ఎంపికలు
శ్రీకాకుళం స్పోర్ట్స్: జిల్లా స్కూల్‌గేమ్ప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాలురు, బాలికల జిల్లాస్థాయి క్రీడా ఎంపికల తేదీలు ఖరారు చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, కార్యదర్శి బీవీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపికలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 13వ తేదీన బాస్కెల్‌బాల్, సపక్‌తక్ర, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నీస్‌లో ఎంపికలు జరుగుతాయని, ఈ నెల 20న అండర్-14 చెస్ బాలబాలికలు, అండర్-17, 19 బాలికలకు మాత్రమే ఎచ్చెర్ల జీహెచ్‌ఎస్‌లో జరుగుతాయన్నారు. ఈ నెల 21న జూడో జడ్పీహెచ్‌ఎస్ (ఒప్పం గి), స్విమ్మింగ్ (శాంతినగర్ కాలనీ, శ్రీకాకుళం), తైక్వాండో, ఫెన్సింగ్ (టౌన్‌హాల్, శ్రీకాకుళం), టెన్నికాయిట్ (జీహెస్‌ఎస్ పలాస), బేస్‌బాల్ (శ్రీకాకుళం)లో జరుగుతాయన్నారు. అదేవిధంగా ఈ నెల 26న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యా డ్మింటన్ (బాలికలు) అర్చరీ, హాకీల్లో ఎంపికలు ఉంటాయని, 27న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్ (బాలురు), బాక్సింగ్‌ల్లో ఎంపికలు జరుగుతాయని, ఈ నెల 28న యోగా, సాఫ్ట్‌బాల్, బాల్ బాడ్మింటన్ త్రోబాల్, హ్యాండ్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, రగ్బీ, నెట్‌బాల్, లాన్ టెన్నీస్, సాఫ్ట్ టెన్నీస్, రోప్ స్కేటింగ్‌లో, ఈ నెల 30న అథ్లెటిక్స్ ఉంటుందన్నారు. అండర్-14 క్రీడాకారులు 2011 జనవరి 1 తర్వాత, అండర్-17 క్రీడాకారులు 2008 తర్వాత, అండర్-19 క్రీడాకారులు 2006 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు.