Share News

పెండింగ్‌ అర్జీలను పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:46 PM

పెండింగ్‌ అర్జీలను తక్షణమే పరి ష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవా రం జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.

 పెండింగ్‌ అర్జీలను పరిష్కరించాలి
అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌

-‘సూర్యఘర్‌’ను సద్వినియోగం చేసుకోవాలి

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 2 (ఆం ధ్రజ్యోతి): పెండింగ్‌ అర్జీలను తక్షణమే పరి ష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవా రం జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి అర్జీదారుల నుంచి 70 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. జిల్లా అధికారులు తమ కార్యాలయా లు, గృహాల వద్ద సోలార్‌ పలకల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఏపీఈపీడీసీఎల్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు. 70 ఏళ్లు పైబడిన వారికి కొత్త పీఎంజేఏవై కార్డుల కోసం నమోదు చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అర్జీలు రీఓపెన్‌ కాకుండా చూ డాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో జిల్లా పరిపా లన కార్యాలయానికి కేటాయించిన స్థలం సరిపోతుందో లేదో చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:46 PM