తలసరి ఆదాయం కూడా తగ్గిపోయింది
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:44 AM
: కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాని, మీ ఓటు విలువ తెలుసు కుని వేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోరారు. శ్రీకాకుళంలో జరిగిన రా కదలిరా సభలోమాట్లాడుతూ..‘ఇప్పుడు తెలంగాణ తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం 44 శాతం తగ్గుదలలో ఉన్నాం. ఒక్కొక్కరి తలసరి ఆదాయం రూ.85వేలు పోగొ ట్టుకున్నాం. సంపద సృష్టించకుండా బటన్‌నొక్కితే ఫలిత ముండదు. సంపద సృష్టించి పేదలకు పంచగలిగేది తెలుగు దేశం మాత్రమే
శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాని, మీ ఓటు విలువ తెలుసు కుని వేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోరారు. శ్రీకాకుళంలో జరిగిన రా కదలిరా సభలోమాట్లాడుతూ..‘ఇప్పుడు తెలంగాణ తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం 44 శాతం తగ్గుదలలో ఉన్నాం. ఒక్కొక్కరి తలసరి ఆదాయం రూ.85వేలు పోగొ ట్టుకున్నాం. సంపద సృష్టించకుండా బటన్‌నొక్కితే ఫలిత ముండదు. సంపద సృష్టించి పేదలకు పంచగలిగేది తెలుగు దేశం మాత్రమే.ఆనాడు ఆస్తిలో ఆడపిల్లలకు హక్కు కల్పించారు ఎన్టీఆర్. నేను డ్వాక్రా సంఘాలను తీసుకువచ్చా. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చాం. కళాశాలల్లో 33 శాతం రిజ ర్వేషన్‌లు తీసుకువచ్చా. మరలా ‘సూపర్‌సిక్స్’ పథకాలు తీసుకు వస్తున్నాం. 19 ఏళ్ల నుంచి 58 సంవత్సరాలలోపు మహిళలకు రూ. 1500 చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తాం. ఎంతమంది పిల్లలుంటే వారి చదువుకోసం ఒక్కోక్కరికి రూ. 15వేల చొప్పున అందజేస్తాం. రాబోయే రోజుల్లో జనాభా ఎంత ఉంటే అంత సంపద. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోయారు. మన పిల్లలను బాగా చది వించుకుందాం. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశంకల్పిస్తాం. రైతులకు రూ. 20వేల చొప్పున ఇస్తాం. వెనుకబడిన వర్గాలకు చెందిన 140 కుటాలకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఎన్నికల్లో ప్రాధా న్యం ఇస్తాం. కార్పొరేషన్‌లు పెట్టి ఆయా కులాలను ఆదుకుం టాం. నిన్ననే టీడీపీకి చెందిన 94 మంది, జనసేనకు చెందిన 5 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించాం. అలాగే వెనుకబడిన వర్గాలకు కూడా న్యాయం చేసి వారి రుణం తీర్చుకుంటాం. వీరి కోసం ప్రత్యేకంగా చట్టం తెస్తాం. మత్స్యకారుల సమస్యల పట్ల అధ్యయనంచేసి డిక్లరేషన్ తీసుకువస్తాం.చెత్తపన్నురద్దు చేస్తాం. రైతులకు సబ్సిడీ అందజేస్తాం. పెట్రోల్ ధరలను నియంత్రిస్తాం. ఉచితంగా ఇసుకను అందజేస్తాం’. అని తెలిపారు.
పర్యటన ఇలా సాగింది
అరసవల్లి: శ్రీకాకుళంలోని డచ్‌బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు సోమవారంమధ్యాహ్నం 3.46 నిమి షాలకు హెలీ కాఫ్టర్‌లో చంద్రబాబునాయుడు చేరుకున్నారు. అక్కడ ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నా యుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళంఅశోక్, శ్రీకాకుళం,పాతపట్నం, నరసన్నపేట, రాజాం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంక టరమణ, బగ్గు రమణమూర్తి, కోండ్రు మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, పల్సస్‌సంస్థల అధినేత గేదెల శ్రీనుబాబు, జనసేననాయకుడు దానేటి శ్రీధర్ స్వాగతం పలి కారు. అనంతరం చంద్రబాబు భారీ భద్రత నడుమ స్థానిక 80 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు సా యంత్రం 4.34 నిమిషాలకుచేరుకున్నారు.అనంతరం సాయం త్రం 5.16 నిమిషాలకు ప్రారంభమైన చంద్రబాబు ప్రసంగంసాయంత్రం 6.16 నిమిషాలకు ముగిసింది. అనం తరం చం ద్రబాబు కారులో బయలుదేరి విశాఖ చేరుకున్నారు.
ఫ శ్రీకాకుళంలోని 80అడుగుల రోడ్డులో జరిగిన రా....కదలిరా సభకు చేరుకున్న చంద్రబాబును నియోజకవర్గ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి, నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తదితరులు గజమాలతో సత్కరించారు.