Share News

పీఎం సూర్యఘర్‌ లక్ష్యాలను అధిగమించాలి

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:50 PM

పీఎం సూర్యఘర్‌ నిర్దేశిత లక్ష్యా లను సకాలంలో అధిగమించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లా, మండల స్థాయి అధికారులతో వివిధ శాఖలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

పీఎం సూర్యఘర్‌ లక్ష్యాలను అధిగమించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్‌ నిర్దేశిత లక్ష్యా లను సకాలంలో అధిగమించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లా, మండల స్థాయి అధికారులతో వివిధ శాఖలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తొలుత ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కృష్ణమూర్తి జిల్లాలో పీఎం సూర్యఘర్‌ పై చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు, ట్రాన్స్‌కో సిబ్బంది సమన్వయంతో పనిచేయాల ని తెలిపారు. మునిసిపాలిటీల్లో పనులు, అపార్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. గృహనిర్మాణాల పురోగతి, లక్ష్యాలు, జియో ట్యాగింగ్‌పై ప్రణాళికలు రూపొం దించుకోవాలని తెలిపారు. పన్నుల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్వో వేంకటేశ్వరరావు, కొవ్వాడ ఉప కలెక్టర్‌ లక్ష్మణమూర్తి, ఉప కలెక్టర్‌ పద్మావతి, ఏవో త్రినాథస్వామి, డీపీవో భారతి సౌజన్య, ఐసీడీఎస్‌ పీడీ శాంతిశ్రీ, సీపీఓ ప్రసన్నలక్ష్మి, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, డిఎంహెచ్‌ఓ బి.మీనాక్షి పాల్గొన్నారు. కాగా 2024-25లో రబీ సీజన్‌కు సంబంధించి పీఎం పంటల బీమా పథకం పోస్టర్‌, కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

Updated Date - Nov 19 , 2024 | 11:50 PM