మర పడవల్లో చేపల వేట నిషేధం
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:57 PM
రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో మర పడవల్లో అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుంచి జూన్ 16 వరకు నిషేఽధించినట్లు మత్స్యశాఖ ఉప సంచాలకులు శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- మత్స్యశాఖ ఉపసంచాలకుడు శ్రీనివాసరావు
కలెక్టరేట్, ఏప్రిల్ 12 ః రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో మర పడవల్లో అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుంచి జూన్ 16 వరకు నిషేఽధించినట్లు మత్స్యశాఖ ఉప సంచాలకులు శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంప్రదాయ పడవలు, తెడ్డు, తెరచాప పడవలు(ఇంజిన్ లేని) వారికి వేట నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ప్రధానంగా వివిధ చేపలు, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగదలను ప్రోత్సహించడం ద్వారా సముద్ర మత్స్య సంపదను కాపాడటమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వేట నిషేధ సమయంలో చట్టాన్ని అతిక్రమించే వారు శిక్షార్హులని, వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ఇతర సంక్షేమ పథకాల నిలుపుదల చేస్తామని తెలిపారు. జరిమానా విధింపుతోపాటు డీజిల్‌పై రాయితీ తొలగిస్తామన్నారు. వేట నిషేధ కాలాన్ని కచ్చితంగా అమలు చేయడానికి మత్స్యశాఖ, కోస్ట్‌గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారులందరూ సహకరించాలని కోరారు.