Share News

భారతదేశంలో పుట్టడం గర్వకారణం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:17 PM

‘భరతమాత ముద్దుబిడ్డలుగా నేటి యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలి. ఈ దేశంలో పుట్టడం మనకు గర్వకారణమ’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

భారతదేశంలో పుట్టడం గర్వకారణం
కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికుడ్ని సన్మానిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- కార్గిల్‌ అమర సైనికులకు నివాళి

కలెక్టరేట్‌, జూలై 26: ‘భరతమాత ముద్దుబిడ్డలుగా నేటి యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలి. ఈ దేశంలో పుట్టడం మనకు గర్వకారణమ’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. కార్గిల్‌ విజయ దివస్‌ సందర్భంగా శుక్రవారం స్థానిక సైనిక సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జిల్లాలోని మాజీ సైనికులు, వారి కుటుంబాల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తగిన పరిష్కారం చేస్తామన్నారు. కార్గిల్‌ యుద్ధంలో దివ్యాంగులుగా మారిన ఇద్దరు మాజీ సైనికులను కలెక్టర్‌ సన్మానించి నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్గిల్‌ యుద్ధంలో అసమాన ధైర్య, సాహసాలను ప్రదర్శించిన సైనిక యోధుల వీరత్వాన్ని కొనియాడారు. కార్గిల్‌ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇతర మాజీ సైనికులను కూడా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది, ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:17 PM