Share News

రాజశేఖరరెడ్డి కొడుకే సీఎం.. పాలన అలాలేదు

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:18 AM

ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొడుకే ఉన్నా.. రాష్ట్రంలో వైఎస్సార్‌ పాలనలా మాత్రం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

రాజశేఖరరెడ్డి కొడుకే సీఎం..  పాలన అలాలేదు
ఇచ్ఛాపురంలో మాట్లాడుతున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

- రాష్ట్రంలో దుర్మార్గపు తీరు గురించి చెప్పండి

- ప్రతి కార్యకర్త ప్రజలను ప్రభావితం చేయాలి

- పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపు

- ఇచ్ఛాపురంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర పైలాన్‌ నుంచే పర్యటన ప్రారంభం

శ్రీకాకుళం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొడుకే ఉన్నా.. రాష్ట్రంలో వైఎస్సార్‌ పాలనలా మాత్రం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ‘ఇచ్ఛా పురం నుంచి ఇడుపులపాయ’ పర్యటనలో భాగం గా మంగళవారం ఉదయం శ్రీకాకుళం నుంచి 8.30 గంటలకు ఆమె ఇచ్ఛాపురం బయలుదేరారు. నరసన్నపేట, టెక్కలి, పలాస ప్రాంతాల్లో అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కంచిలి మండలం అంపురం జంక్షన్‌ వద్ద కాన్వాయ్‌ దిగి ఆర్టీసీ బస్సులో ఇచ్ఛాపురం వరకు ఆమె ప్రయాణించి ప్రయాణికులతో మాట్లా డారు. అనంతరం ఇచ్ఛాపురంలో వైఎ స్సాఆర్‌ ముగించిన ప్రజాప్రస్థానం పాద యాత్ర పైలాన్‌ వద్ద తన పర్యటనను ప్రారంభించారు. అక్కడ వైఎస్‌ఆర్‌ విగ్రహా నికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్క డ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్జే ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ తన తం డ్రి వైఎస్సార్‌ ముగించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర పైలాన్‌ వద్ద నుంచి తన పర్యటన ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన గురించి ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త పలువురిని ప్రభావితం చేసి కాంగ్రెస్‌ పార్టీ వల్లనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలియజేయాలని సూచించారు. ‘ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ఉపాధి హామీ పథకం, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇంది రమ్మ ఇళ్లు.. ఇవన్నీ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టారు. ఇప్పుడు యువకులకు ఉపాధి లేదు. ఉద్యోగావకాశాలు లేవు. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం లేదు. పోల వరం ప్రాజెక్టు పూర్తికాలేదు. కులాలతో సంబం ధం లేకుండా ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి’ అని షర్మిల అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ వ్యవ హారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, మాజీ మంత్రులు రఘువీరా రెడ్డి, జేడీ శీలం, పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వ రరావు, మాజీ ఎమ్మెల్యే సత్యవతి పాల్గొన్నారు.

పర్యటనలో ద్వితీయశ్రేణి వైసీపీ నాయకులు

ఊహించినట్లే అధికార పార్టీ వైసీపీకి.. పీసీసీ అధ్యక్షురాలి వల్ల నష్టం వాటిల్లనుందని షర్మిల పర్యటనలో తేటతెల్లమైంది. శ్రీకాకుళం నుంచి షర్మిల బయలుదేరగానే నరసన్నపేట, టెక్కలి, పలాస హైవే వద్ద షర్మిలకు స్వాగతం పలికేందుకు పలువురు హాజరయ్యారు. అందులో వైసీపీకి చెందిన ద్వితీయ స్థాయి నాయకులు, కార్యకర్తలే ఉన్నారు. అలాగే ఇచ్ఛాపురంలో వైసీపీ ఎంపీటీసీ స్వయంగా పాల్గొన్నారు. షర్మిల సమావేశంలో ఆ ఎంపీటీసీ మాట్లాడుతూ ‘నాతోపాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కొన్ని బిల్లుల బకాయిల వల్లన ఆలోచనలో పడ్డారు. సభకు హాజరైనవారిలో సగం మంది జనాన్ని వారే పంపించారు’ అని వివరించారు. దీంతో ఎన్నికల సమయానికి వైఎస్సార్‌ అభిమానులు.. వైసీపీలో అసంతృప్తితో కొనసాగుతున్న కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు షర్మిలకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఊహించిన దానికంటే పర్యటన విజయవంతం చేయడంపై జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వరరావును ఈ సందర్భంగా షర్మిల అభినందించారు.

Updated Date - Jan 24 , 2024 | 12:18 AM