బీఆర్‌ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్‌కి గుర్తింపు
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:30 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల బృందానికి ఉత్తమ చురుకైన యూనిట్‌గా, ఉత్తమ పీవోగా కె.కరుణా నిధికి గుర్తింపు లభించింది.
ఎచ్చెర్ల, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల బృందానికి ఉత్తమ చురుకైన యూనిట్‌గా, ఉత్తమ పీవోగా కె.కరుణా నిధికి గుర్తింపు లభించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మౌంటైనింగ్ అండ్ ఎలైడ్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో పది రోజుల పాటు జరిగిన ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ సాహస శిబిరంలో పాల్గొన్న వర్సిటీ యూనిట్ బృందం అన్నింటా ప్రతిభ చూపింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గౌతమ్ ఠాకూర్ నుంచి ప్రశంసా పత్రాన్ని, షీల్డ్‌ను యూనిట్ సభ్యులు శనివారం అందుకున్నారు. బీఆర్‌ఏయూ నుంచి ఎనిమిది మంది, సూర్యతేజ డిగ్రీ కళాశాల (పలాస)కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ బృందంలో పాల్గొన్నారు. శనివారం వీరంతా ఎన్‌ఎస్‌ఎస్ పీవో కరుణానిధి ఆధ్వర్యంలో నూఢిల్లీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలుసుకున్నారు. కాగా వర్సిటీ వీసీ కేఆర్ రజని, రెక్టార్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ పి.సుజాత, వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జి కోఆర్డినేటర్ డి.వనజ తదితరులు ఈ బృందానికి అభినందనలు తెలిపారు.