Share News

encroachment ఆక్రమణలు తొలగించండి

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:49 PM

encroachment పట్టణంలో ఎక్కడ ఆక్రమణలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చినా తక్షణం పరిశీ లించి తొలగించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తిలకు ఆదేశించారు.

encroachment  ఆక్రమణలు తొలగించండి
భవానీనగర్‌లో పర్యటిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఎక్కడ ఆక్రమణలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చినా తక్షణం పరిశీ లించి తొలగించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తిలకు ఆదేశించారు. మంగళవారం జడ్పీ రోడ్డు, భవానీనగర్‌ ప్రాం తాల్లో పర్యటించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొల గించాలని, అవసరమైతే రెవెన్యూ, పోలీస్‌ యం త్రాంగాల సాయంతో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. రూ.1.82 కోట్ల అంచనాతో నిర్మాణమవుతున్న భవానీ నగర్‌ పనులను పీఆర్‌ ఈఈ సూర్య ప్రకాష్‌, డీఈఈ పి.సుధా కర్‌లతో కలిసి పరిశీలించారు. పాత జాతీయ రహదారి ప్రాంతంలో ఉన్న ఆక్రమణలు తొలగించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బగాది శేషగిరి, పినకాన అజయ్‌ కుమార్‌, ఎల్‌ఎల్‌ నాయుడు, హనుమంతు రామకృష్ణ, లవకుమార్‌, రాము, దోని బుజ్జి, కామేసు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు క్యాలెండర్‌ను మంగళవారం మం త్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈ వో డి.వరప్ర సాద్‌, జీఎం ఎస్‌.జగదీష్‌, బసవలింగం, ఏజీ ఎంలు భాస్కరరావు, బి.దశరథరావు, టెక్కలి, నరసన్నపేట బ్యాంకు మేనేజర్లు దినమణి, ఇప్పిలి సీతారాం పాల్గొన్నారు.

రెండు కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన

నందిగాం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పెద్దతామరా పల్లి-తూముకొండ ఆర్‌అండ్‌బీ మార్గంలోని నౌగాం, దిమ్మిడి జోల వద్ద కల్వర్టుల నిర్మాణానికి మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జామి సుధాకర్‌, ఈఈ సత్యన్నారాయణ, డీఈఈ రవికాంత్‌, ఏఈ ఎన్‌ఎల్‌ నాయుడు, నాయకులు పి.అజయ్‌ కుమార్‌, పి.చంద్రశేఖర్‌, దాసునాయుడు, లక్ష్మణరావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:49 PM