Share News

నదులు అనుసంధానం చేపట్టాలి

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:38 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాలకులు చేసిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, తక్షణం నదు లు అనుసంధానం చేపట్టాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమో క్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టుపాటి వెంకటేశ్వర్లు అన్నారు.

నదులు అనుసంధానం చేపట్టాలి

టెక్కలి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాలకులు చేసిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, తక్షణం నదు లు అనుసంధానం చేపట్టాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమో క్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టుపాటి వెంకటేశ్వర్లు అన్నారు. ‘ఉత్తరాంధ్ర వెనుకబాటు- పాలకుల నిర్లక్ష్యం’పై ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా ఉత్త రాంధ్రకు సాగునీరందించాలన్నారు. వంశధార నీటిని ఇచ్ఛాపురం వరకు పొడిగించాలన్నారు. మత్స్యకారులకు కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయా లన్నారు. ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షులు కేవీ జగన్నాథం, జుద్వేరా స్వామి, సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బదకల ఈశ్వరమ్మ, సవర బంగ్లా, కుమార్‌ శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:38 PM