Share News

ఆదిత్యాలయంలో సంగీత నీరాజనం

ABN , Publish Date - Dec 01 , 2024 | 11:54 PM

ఆరో గ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం కృష్ణవేణి సంగీత నీరాజనం వైభవంగా జరిగింది.

ఆదిత్యాలయంలో సంగీత నీరాజనం

అరసవల్లి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆరో గ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం కృష్ణవేణి సంగీత నీరాజనం వైభవంగా జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, నర సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయ అని వెట్టి మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత విదుషీమణి మండ సుధారాణి బృం దం ఆలపించిన వాతాపి గణపతిం భజే, ఎంద రో మహానుభావులు వంటి కీర్తనలు ఆహుతు లను అలరించాయి. కార్యక్రమంలో చందర్‌ నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, అరసవల్లి దేవస్థానం ఈవో వై.భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, జిల్లా పర్యాటకాధికారి నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. మావుడూరు సత్యనారాయణ శర్మ (వయోలిన్‌), ఎం.శ్రీధర్‌ (మృదంగం), మావుడూరు సూర్య ప్రసాద్‌ (ఘటం) వాద్య సహకారాన్ని అందజేశారు.

Updated Date - Dec 01 , 2024 | 11:54 PM