Share News

లింగాలవలసలో స్కూల్‌ గేమ్స్‌ ఎంపికలు

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:39 PM

లింగాలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కూల్‌గేమ్స్‌ గ్రిగ్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సర్పంచ్‌ సంపతిరావు లక్ష్మి ప్రారంభించారు.

లింగాలవలసలో స్కూల్‌ గేమ్స్‌ ఎంపికలు

టెక్కలి: లింగాలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కూల్‌గేమ్స్‌ గ్రిగ్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సర్పంచ్‌ సంపతిరావు లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈ వోలు డి.తులసీరావు, చిన్నారావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాల న్నారు. సీనియర్‌ గర్ల్స్‌ విభాగంలో భీంపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రథమ, చాకిపల్లి జడ్పీ ఉన్నతపాఠశాల విద్యార్థినులు ద్వితీయ స్థానం సాధించారు. బాలుర విభాగంలో టెక్కలి ప్రథమ, చాకిపల్లి జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో హెచ్‌ఎం వైకుంఠ రావు, క్రీడా ఇన్‌చార్జ్‌ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక

పలాస: పలాస నియోజకవర్గ క్రీడాకారుల పోటీలను శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ పోటీలను బాలబాలికలకు నిర్వ హించారు. అనంతరం వారిని జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం డి.దాశరధి, ఎంఈవో శ్రీనివాసరావు, రాష్ట్ర టెన్నీకాయట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పి.తవి టయ్య, పీఈటీలు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సాగిన గ్రిగ్స్‌ పోటీలు

పాతపట్నం: కొరసవాడ జడ్పీహైస్కూల్‌ ఆవరణలో శుక్రవారం మండలస్థాయి గ్రిగ్స్‌ పోటీ లను ఎంఈవో-2 తిరమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. పోటీలను హెచ్‌ఎం బి.సింహాచలం, విశ్రాంత వ్యాయా మోపాధ్యాయుడు మడ్డు తాతయ్య తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - Sep 20 , 2024 | 11:39 PM