Share News

గంజాయితో ఏడుగురి అరెస్టు

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:43 AM

దుప్ప వలస గురుకుల పాఠశాల వెనుకు ఉన్న లే ఔట్‌ తుప్పల్లో రెండు కిలోల గంజాయితో ఏడుగురు యువకులు పట్టుబడినట్టు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం బుధవారం తెలిపారు.

గంజాయితో ఏడుగురి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న జేఆర్‌ పురం సీఐ అవతారం

ఎచ్చెర్ల, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దుప్ప వలస గురుకుల పాఠశాల వెనుకు ఉన్న లే ఔట్‌ తుప్పల్లో రెండు కిలోల గంజాయితో ఏడుగురు యువకులు పట్టుబడినట్టు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్‌కుమా ర్‌, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు. ఈ యువకులు ఈ నెల 23వ తేదీన పర్లాకిమిడికి చెందిన సగిపల్లి పవన్‌ వద్ద రూ.20 వేలకు కొను గోలు చేసిన రెండు కిలోల గంజాయిని వాటాలు వేసుకుం టుండగా పట్టుకున్నామన్నారు. అరెస్టు అయి నవారిలో నిడిగింట్ల చరణ్‌, సూర రాజ్‌కు మార్‌, లక్కవరపు ప్రసాద్‌కుమార్‌, గుండ్రపు బాలగణపతి, పిన్నింటి చంటి, కూన సాయి కిరణ్‌, సవలాపురపు వంశీ ఉన్నారని చెప్పా రు. వీరి నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్స్‌, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నా మన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Oct 31 , 2024 | 12:43 AM