Share News

లోటుపాట్ల గుర్తింపునకు సామాజిక తనిఖీ: పీడీ

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:17 AM

ఉపాధి హామీ పథకంలో అవకతవకలు, లోటు పాట్లు గుర్తించేందుకే ప్రతిఏడాది సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నామని డ్వామా పీడీ బి.సుధాకర్‌ తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం లో 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

 లోటుపాట్ల గుర్తింపునకు సామాజిక తనిఖీ: పీడీ
మాట్లాడుతున్న డ్వామా పీడీ సుధాకర్‌

మందస, నవంబరు 30(ఆంధ్రజ్యోతి):ఉపాధి హామీ పథకంలో అవకతవకలు, లోటు పాట్లు గుర్తించేందుకే ప్రతిఏడాది సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నామని డ్వామా పీడీ బి.సుధాకర్‌ తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం లో 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది ఏప్రిల్‌ నుంచి 24 మార్చి వరకు మండలంలో 41 పంచాయతీల్లో చేపట్టిన 3,553 అభివృద్ధి పనులకు గాను డీఆర్‌పీల నివేదిక చదివి వినిపించారు. వేతనాలు రూ.2కోట్ల 76 లక్షలు, మెటీరియల్‌ రూ.8కోట్ల 72క్షల 95 వేలు ఖర్చు జరిగినట్లు తెలి పారు. కాగా మందస ఫీల్డ్‌అసిస్టెంట్‌ గణపతిపై టీడీపీ మండలాధ్యక్షుడు భావన దుర్యోధన, మరికొంతమంది టీడీపీ నాయకులు డ్వామా పీడీ బి.సుధాకర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఉపాధికూలీల నుంచి ప్రతి వారం రూ.100 చొప్పున అక్రమ వసూలుచేశారని, కొంతమంది ఇవ్వడం లేదని పని కల్పించలేదని పేర్కొ న్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ స్వరూపారాణి,, ఏపీడీడబ్ల్యు రాధా, శ్రీనివాసరెడ్డి, మేనేజ రు శ్రావణ్‌, ఎస్‌ఆర్‌డబ్ల్యు పున్నపునాయుడు, తిరుపతి, ఎంపీడీవో పి.సూర్యనారాయణ, ఎంపీపీ దానయ్య, ఏపీవో హరికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:17 AM