Share News

తీర్థయాత్రలకు ప్రత్యేక ఎయిర్‌ ప్యాకేజీ

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:13 AM

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రత్యేక ఎయిర్‌ ప్యాకేజీలను విశాఖ నుంచి ప్రారంభించినట్టు ఐఆర్‌ సీటీసీ ఆర్‌ఎం క్రాంతి సావర్కర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తీర్థయాత్రలకు ప్రత్యేక ఎయిర్‌ ప్యాకేజీ

- ఐఆర్‌సీటీసీ ఆర్‌ఎం క్రాంతి సావర్కర్‌

ఆమదాలవలస: ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రత్యేక ఎయిర్‌ ప్యాకేజీలను విశాఖ నుంచి ప్రారంభించినట్టు ఐఆర్‌ సీటీసీ ఆర్‌ఎం క్రాంతి సావర్కర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేం ద్రాలు సందర్శించే భక్తుల కోసం ప్రత్యేక ఎయిర్‌ ప్యాకేజీ ప్రకటించినట్టు తెలిపారు. ఆకర్షిణీయమైన థాయిలాండ్‌ పర్యటన ఐదు రాత్రులు.. ఆరు రోజులు ఉంటుందన్నారు. ఈ పర్యటన సెప్టెంబరు 7వ తేదీన బయలుదేరి 12వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ పర్యటనలో సందర్శించే ప్రదేశాలు పటాయాలో నాంగ్‌సూచ్‌గార్డెన్‌, అల్కాజర్‌షో కోరల్‌ ఐలాండ్‌, సఫారీ వరల్డ్‌టూర్‌, డిన్నర్‌తో రివర్‌ క్రూజ్‌ అలాగే బ్యాంకాక్‌లోని గోల్డెన్‌ బుద్ధ, మార్బుల్‌ బుద్ధ, శ్రీరాధా టైగర్‌ జూ వంటి ప్రదేశాలు సందర్శించడం జరుగుతుందన్నారు. ఈ ప్రయాణానికి ఎయిర్‌ ప్యాకేజీ ధరలు ఒకవ్యక్తికి రూ.66,735, డబుల్‌ ఆక్యుపెన్సీ రూ.57,815, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ రూ.57,815 ఉంటుందన్నారు. అలాగే దక్షిణ దివ్య ఆలయ పర్యటన ఐదు రాత్రులు, ఆరు రోజులు ఉంటుందన్నారు. ఈ పర్యటన ఆగస్టు 14 నుంచి 19వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ పర్యటనలో మదురై మీనాక్షి ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయం, ధనుస్కోటి, కన్యా కుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌, త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయం వంటి ప్రదేశాలు సందర్శన ఉంటుందన్నారు. ఈ ప్రయాణానికి సింగిల్‌ రూ.51,400, డబుల్‌ ఆక్యుపెన్సీ రూ.39,880, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ రూ.38,005 ఉంటుందన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎకానమీ క్లాస్‌ విమానం టిక్కెట్లు, ఏసీ హోటల్‌, వసతి ఐదు బ్రేక్‌పాస్ట్‌లు, ఐదు డిన్నర్లు, ప్రయాణ బీమా, టూర్‌ మేనేజర్‌ సేవలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 92810 30748, 92814 95847, 95501 66168 ఫోన్‌ నెంబర్లులో సంప్రదించాలని కోరారు.

Updated Date - Jul 22 , 2024 | 12:13 AM