Share News

విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే రవికుమార్‌

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:09 AM

: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌ తెలిపారు. సోమవారం మునిసిపాలిటీ పరిధిలోని తాళ్లవలస కేజీబీవీ పాఠశాలలో 234 మంది విద్యార్థినులకు ఆమదాలవలస సత్యసాయి సేవా సమితి సమకూర్చిన దుస్తులను పంపిణీ చేశారు.

  విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే రవికుమార్‌
విద్యార్థినులకు దుస్తులు పంపిణీ చేస్తున్న రవికుమార్‌

ఆమదాలవలస, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌ తెలిపారు. సోమవారం మునిసిపాలిటీ పరిధిలోని తాళ్లవలస కేజీబీవీ పాఠశాలలో 234 మంది విద్యార్థినులకు ఆమదాలవలస సత్యసాయి సేవా సమితి సమకూర్చిన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో సమగ్ర విద్యా భివృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. కార్య క్రమంలోటీడీపీ నాయకులు నూకరాజు, సనపల ఢిల్లేశ్వరరావు, సంపదరావు మురళీధరరావు, తమ్మి నేని అమర్నాధ్‌, ఎన్ని శ్రీదేవి, సత్యసాయి సేవా సభ్యులు, కేజీబీవీ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:09 AM