Spiritual union ఆత్మీయ కలయిక.. ఐక్యతకు చిహ్నం
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:07 AM
Spiritual union ఆత్మీయ కలయిక.. ఐక్యతకు చిహ్నం అని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆత్మీయ కలయిక.. ఐక్యతకు చిహ్నం అని టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. ఎచ్చెర్లలో ఆదివారం తూర్పు కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలు పనిచేస్తే హక్కుల సాధన సాధ్యపడు తుందన్నారు. శాసనమండలి ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యా ఉపాధి కల్పనకు సామాజిక వర్గంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, వివిధ పక్షాల నేతలు శ్రద్ధ తీసుకోవాలన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పక్షాలు సామాజిక సమీకరణాలు పరిశీలిస్తాయని చెప్పారు. శ్రీకాకుళంలో నిర్మిస్తున్న సామాజిక భవన నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. పల్సస్ సీఈవో, పారిశ్రా మిక వేత్త గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ శ్రీకాకుళంలో సామాజి క భవన నిర్మాణానికి రూ.1.67 కోట్లు విరాళం అందిస్తానని, ఇంతవరకు రూ.50 లక్షలు ఇచ్చానన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మీసాల నీలకంఠంనాయుడు, గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, డైరెక్టర్లు పిసిని చంద్రమోహన్, గండి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.