కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:07 AM
Study Hard for Success కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆర్జీయూకేటీ (నూజివీడు) రిజిస్ట్రార్ డాక్టర్ సండ్ర అమరేంద్రకుమార్ విద్యార్థులకు సూచించారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆర్జీయూకేటీ (నూజివీడు) రిజిస్ట్రార్ డాక్టర్ సండ్ర అమరేంద్రకుమార్ విద్యార్థులకు సూచించారు. ఎస్‌ఎం పురం కొండపై ఉన్న శ్రీకాకుళం క్యాంపస్‌ను ఆయన గురువారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిభ గల విద్యార్థులే ట్రిపుల్ ఐటీలో చేరుతున్నప్పటికీ పీయూసీ పూర్త య్యేసరికి 30 శాతానికి పైగా ఫెయిల్ అవుతున్నారన్నారు. వీరికి రెండు, మూడుసార్లు రెమిడియల్ తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. అధ్యాపకులు కూడా అకడమిక్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉత్తమ ఫలితాలు సాధనకు కృషిచేయాలన్నారు. మెంటార్స్‌కు ప్రత్యేక డిజిగ్నైజే షన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ కొర్ల మోహనకృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి పాల్గొన్నారు.