Share News

మెనూ సక్రమంగా అమలు చేయాలి

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:15 AM

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం విషయంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సీతంపేట ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు అన్నారు.

మెనూ సక్రమంగా అమలు చేయాలి
ఆశ్రమ పాఠశాలను పరిశీలిస్తున్న ఐటీడీఏ ఏపీవో

సరుబుజ్జిలి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం విషయంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సీతంపేట ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు అన్నారు. గురువారం ఆయన మండలంలోని వెన్నలవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు మెనూ ప్రకారం ప్రతిరోజూ ఆరోగ్యకరమైన భోజనం అందించడానికి చర్యలు తీసుకోవా లన్నారు. విద్యార్థులకు అందించే తాగునీరు ఆర్‌వో ప్లాంట్‌ పనితీరును పరిశీలించి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంను ఆదేశించారు. ఎంఈవో డి.బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:15 AM