Share News

youth employment: యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:00 AM

youth employment: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెల కొల్పిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

youth employment:  యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

అరసవల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెల కొల్పిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వివిధ పారిశ్రామిక సంస్థల యాజమాన్య ప్రతినిథులతో హెచ్‌ఆర్‌ కాంక్లేవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉత్తరాంధ్రకు చెందిన కార్మికులు కనిపిస్తారని, సమస్యకు పరిష్కారం చూపేలా, జిల్లాలో వేలాదిమందికి ఉపాధి కల్పించేలా పారిశ్రామికవేత్తలు ఉద్యోగ విప్లవా నికి నాంది పలకాలని పిలుపునిచ్చారు.


జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన, ఉపాధి కేంద్రాల ఏర్పాటుద్వారానే ఇది సాధ్యమన్నారు. ఇందుకు అను గుణంగా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు సహకారం అందిం చాలనికోరారు. కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్త లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు.ఇదేస్ఫూర్తితో ఇన్వెస్ట్‌ ఇన్‌ శ్రీకాకుళం పేరిట జిల్లాలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వ నున్నామని, నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలో సమయం వృఽథా చేయ కుండా, ప్రతికుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త తయారు కా వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:00 AM