The robbery attempt పథకం ప్రకారమే..
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:20 AM
The robbery attempt శ్రీకాకుళం నగరంలో ఇటీవల ఓ వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి, కత్తులతో బెదిరించి దొంగతనానికి యత్నించడంపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. నేరానికి పాల్పడిన ముగ్గురితో పాటు దీనివెనుక ఉన్న సూత్రధారిని కూడా అరెస్టు చేశారు. పథకం ప్రకారమే వారు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వ్యాపారి ఇంట్లో చోరీకి యత్నం
కేసు ఛేదించిన పోలీసులు
నలుగురి అరెస్టు.. ఇద్దరి పాత్రపై విచారణ
శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద
శ్రీకాకుళంక్రైం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో ఇటీవల ఓ వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి, కత్తులతో బెదిరించి దొంగతనానికి యత్నించడంపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. నేరానికి పాల్పడిన ముగ్గురితో పాటు దీనివెనుక ఉన్న సూత్రధారిని కూడా అరెస్టు చేశారు. పథకం ప్రకారమే వారు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను మంగళవారం శ్రీకాకుళం సబ్ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. శ్రీకాకుళం గూనపాలెంలో ఇంటి వద్దనే కిరాణా షాపు నిర్వహిస్తున్న పెద్దిన లక్ష్మణరావు అప్పుల కారణంగా గతంలో ఓ షాపింగ్‌మాల్‌లో దుస్తులు దొంగతనం చేశాడు. అలాగే, రూ.2లక్షల వరకు కాజేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మళ్లీ ఏదైనా దొంగతనం చేయాలని భావించాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి హోల్‌సేల్ షాపులకు ఆయిల్ తీసుకువచ్చే లారీడ్రైవర్ సజ్జు అలియాస్ కార్తీక్‌ని కలిసి దొంగతనానికి తనకు మనుషులు కావాలని చెప్పాడు. దీంతో సజ్జుకి తెలిసిన తన రాష్ట్రంలోని భద్రాచలం గ్రామానికి చెందిన యాకూబ్‌ను లక్ష్మణరావుకి పరిచయం చేశాడు. యాకూబ్ తన మేనల్లుడైన ఓ మైనర్ (2023లో హత్య కేసు నిందితుడు)కు ఈ విషయాన్ని చెప్పాడు. అతను జువైనల్ శిక్ష అనుభవించిన మరోక వ్యక్తిని లక్ష్మణరావుకి పరిచయం చేశాడు. ఆ వ్యక్తి తనకు మిత్రులైన తెలంగాణ రాష్ట్రం నాగరకర్నూల్ జిల్లా శానిపల్లి గ్రామానికి చెందిన కూరాకుల భానుప్రకాష్ అలియాస్ భాను, కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామానికి చిగురుపాటి ఆంజనేయులు అలియాస్ అంజి, రాహుల్‌ను లక్ష్మణరావుకి పరిచయం చేశాడు. దీంతో భానుప్రకాష్, ఆంజనేయులు, ఓ మైనర్ (యాకూబ్ మేనల్లుడు) ఈ నెల 16న శ్రీకాకుళం చేరుకున్నారు. వీరితో కలిసి లక్ష్మణరావు రెండు రోజులపాటు నగరంలో పలు చోట్ల రెక్కీ నిర్వహించారు. ఈ నెల 18న స్థానిక ఇండియన్ బ్యాంకులో దొంగతనానికి యత్నించారు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో దాన్ని విరమించుకున్నారు. గూనపాలెనికి చెందిన వనజ ఇంట్లోకి పెళ్లి పేరుతో దొంగతనానికి వెళ్లగా వారంతా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. తరువాత లక్ష్మణరావు ఇంటి సమీపంలో ఉన్న కోరాడ గోవిందరావు అనే వ్యాపారికి చెందిన షాపులో చోరీ చేయాలని భావించినా కుదర్లేదు. దీంతో నగరంలోని కాకివీధిలో ఉన్న గోవిందరావు ఇంటిని లక్ష్మణరావు చూపించాడు. ఇంట్లో గోవిందరావు భార్య, నడవలేని తల్లి మాత్రమే ఉంటారని, ఇంటికి ముందు వెనుక తోవ ఉందని, దొంగతనం చేయాలని చెప్పాడు. దీంతో ఈ నెల 21 శనివారం రాత్రి 6 గంటలకు భానుప్రకాష్, ఆంజనేయులు, ఓ మైనర్(యాకూబ్ మేనల్లుడు) గోవిందరావు ఇంట్లోకి చొరబడ్డారు. గోవిందరావు తల్లి సూర్యకుమారి, భార్య మౌనికను కత్తులతో బెదిరించి అక్కడే టీవీ దగ్గర ఉన్న రూ.12వేలను చోరీ చేశారు. అయితే అనుకోకుండా గోవిందరావు ఇంట్లో ఆ రోజు భార్య, తల్లితో పాటు ఆయన వదిన(అన్న భార్య), ఆమె కుమారుడు ఉండడంతో వారంతా దొంగలను ప్రతిఘటించారు. దీంతో దొంగలు కత్తులు పడేసి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోతున్న ఆంజనేయులు వన్‌టౌన్ రైటర్ బి.రవికుమార్ చేతికి చిక్కాడు. అతడిని విచారించగా మిగిలిన ఇద్దరి వివరాల చెప్పడంతో పోలీసులు గాలించి విశాఖపట్నంలో అదే రోజు రాత్రి పట్టుకుని శ్రీకాకుళం తీసుకొచ్చారు. వారిని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఇద్దరి లారీ డ్రైవర్ల పాత్రపై విచారణ జరుగుతుందని డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడు పెద్దిన లక్ష్మణరావుతోపాటు భానుప్రకాష్, ఆంజనేయులు, మైనర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.10 వేల నగదు, కత్తులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించిన వారిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. సీఐ పైడపునాయుడు, క్రైం సిబ్బంది హెచ్‌సీ బి.రవికుమార్, కానిస్టేబుళ్లు ఆర్.సూరిబాబు, ఎస్.రవికుమార్, పి.గోపాల్‌కు రివార్డులు అందించారు.