Share News

ముగిసిన టెక్‌ ఫెస్ట్‌

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:31 AM

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ క ళాశాల (శ్రీకాకుళం)లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రాంతీ య స్థాయి టెక్‌ ఫెస్ట్‌-2024 శుక్రవారంతో ముగిసింది.

ముగిసిన టెక్‌ ఫెస్ట్‌
ప్రథమ బహుమతి అందుకుంటున్న శివానీ కళాశాల విద్యార్థులు

- శివానీ విద్యార్థులకు ప్రథమ బహుమతి

ఎచ్చెర్ల, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలిటెక్నిక్‌ క ళాశాల (శ్రీకాకుళం)లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రాంతీ య స్థాయి టెక్‌ ఫెస్ట్‌-2024 శుక్రవారంతో ముగిసింది. ఈ ఫెస్ట్‌ లో 10 పాలిటెక్నిక్‌ కళాశాలల నుంచి విద్యార్థులు 64 ప్రాజెక్ట్‌లు ప్రదర్శించారు. ఇందులో శివానీ పాలిటెక్నిక్‌ కళాశాల (చిలకపా లెం) ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌కు ప్రఽథమ బహుమతిగా రూ.25 వేలు, వెంకటేశ్వర ఫార్మసీ కళాశా ల (ఎచ్చెర్ల) కంప్యూటర్‌ బ్రాంచ్‌ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్‌కు ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు దక్కించుకున్నాయి. త్వరలో రాష్ట్ర స్థాయిలో జరగనున్న టెక్‌ ఫెస్ట్‌కు ఈ రెండింటితోపాటు మొత్తం 15 ప్రాజె క్ట్‌లను ప్రదర్శించనున్నారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్ని క్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నారాయణరావు మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు ఆహ్లాదరకరమైన వాతావరణంలో టెక్‌ఫెస్ట్‌ జరిగిందన్నారు. ఇలాంటి ఫెస్ట్‌ల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ బి.జానకిరామయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జి.దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులను ఈ ప్రాజెక్ట్‌లను తిలకించారు.

Updated Date - Dec 07 , 2024 | 12:31 AM