దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలి
ABN , Publish Date - May 21 , 2024 | 11:47 PM
ఒకే దేశం, ఒకే ఖనిజం, ఒకే రాయల్టీ అనే అంశంపై నీతిఅయోగ్ న్యూఢిల్లీలో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో చిన్న ఖనిజ పరిశ్రమల సమాఖ్య( ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ-ఫెమ్మీ) ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొని వివిధ అంశాలపై నివేదికను అందజేశారు.
- నీతి అయోగ్‌కు ఫెమ్మీ నివేదిక
టెక్కలి, మే 21: ఒకే దేశం, ఒకే ఖనిజం, ఒకే రాయల్టీ అనే అంశంపై నీతిఅయోగ్ న్యూఢిల్లీలో సోమవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో చిన్న ఖనిజ పరిశ్రమల సమాఖ్య( ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ-ఫెమ్మీ) ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొని వివిధ అంశాలపై నివేదికను అందజేశారు. దేశం మొత్తంగా ఒకే పన్నుల వ్యవస్థ ఉండాలని, మైనర్ మినరల్ ఆక్షన్ తీసివేయాలని నీతిఅయోగ్‌కు సూచించారు. వివిధ రాష్ట్రాల్లో చిన్నఖనిజాలపై విధించిన రాయల్టీ రేట్లు, ఇతర సుంకాలపై కూడా అవగాహన కల్పించారు. వంద రోజుల్లో ఈ సూచనలను పార్లమెంట్‌లో రూపకల్పన చేసేలా చర్యలు తీసుకుంటామని నీతిఅయోగ్ అధికారులు వెల్లడించారు. దేశ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనలో చిన్నపరిశ్రమల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించడం శుభపరిణామమని ఫెమ్మీ ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు. ఎఫ్‌ఐఎంఐ, ఎంఈఏఐ, ఎఫ్‌ఏఎంఆర్, జీయూజేఎంఐఎన్ మినరల్ ఇండస్ట్రీల అసోసియేషన్స్ ద్వారా సంబంధిత స్టేట్ హోల్డర్స్ అభిప్రాయాలను సైతం సేకరించారు. కార్యక్రమంలో ఫెమ్మీ జనరల్ సెక్రటరీ డాక్టర్ సీహెచ్ రావు, వైస్‌ప్రెసిడెంట్ డి.సుబ్బారావు, నీతిఅయోగ్ మెంబర్ డాక్టర్ సారస్వాత్ మైన్స్ సెక్రటరీ కాంతారావు, అడిషినల్ సెక్రటరీ, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు.