వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:09 AM
ఓ వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దుండగులు కత్తులతో చొరబడి, బంగారు ఆభరణాల చోరీకి యత్నించిన ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది.
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఓ వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దుండగులు కత్తులతో చొరబడి, బంగారు ఆభరణాల చోరీకి యత్నించిన ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక కాకివీధిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంను ఆనుకుని ఉన్న ఇంట్లో కోరాడ గోవింద్ కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈయన పెద్ద మార్కెట్‌లో కిరాణా షాపు నడుపుతూ జీవనో పాధి సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఎప్పటిలాగే దుకాణా నికి వెళ్లిపోయాడు. రాత్రి 7.20 గంటల సమయంలో ముగు ్గరు దుండగులు కత్తులతో గోవింద్ ఇంటికి వచ్చారు. వీరిలో ఇద్దరు ప్రధాన గుమ్మం నుంచి లోపలకు చొరబడి తలు పులు మూసేశారు. అప్పటికే హాల్‌లో గోవింద్ తల్లి సూర్య కుమారి, భార్య మౌనిక టీవీ చూస్తున్నారు. తలుపు చప్పు డు కావడంతో వారిద్దరు లేచి చూసేసరికి ఇద్దరు వ్యక్తులు కత్తులతో కనిపించారు. మరో దుండగుడు ఇంటి వెనుక నుంచి చొరబడేందుకు ప్రయత్నించగా.. వంట గదిలో గోవింద్ అన్న భార్య, ఆమె కుమారుడు గమనించి తలు పులు మూసేశారు. ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దుండ గులు గోవింద్ తల్లిని, భార్యను కత్తితో బెదిరించి మెడలో బంగారు ఆభరణాలు దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. వంట గదిలోంచి కూరగాయలు తరిమే కత్తితో గోవింద్ అన్న కొడుకు, చీపురు కట్టతో మౌనిక ప్రతిఘటించి.. దొంగలు అంటూ పెద్దగా కేకలు వేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాం తం కావడంతో కేకలు బయటకు వినిపిస్తుండడంతో దొరికి పోతామన్న భయంతో ఆ ఇద్దరు దుండగులు తమతో తెచ్చుకున్న కత్తులను అక్కడే పడేసి పారిపోయారు.
పోలీసుల అదుపులో దుండగుడు
ఇంట్లో కత్తులు వదిలేసి పరారైన దుండగులను స్థాని కులు వెంబడించగా, మరో పక్క పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అయితే మరో ఇద్దరు మాత్రం బైక్‌పై పరారయ్యారు. ుట న స్థలానికి చేరుకున్న సీఐ కె.పైడపునాయుడు దొరి కిన ముద్దాయిని.. విచారించి స్టేషన్‌కు తరలించారు. కొద్ది సేప టికే శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద అక్కడకు చేరు కున్నారు. ఇంతలోనే క్లూస్ బృందం అక్కడకు చేరుకుని వేలి ముద్రలు సేకరించారు. అయితే నిందితులు ముగ్గురు తెలం గాణకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం వన్‌టౌన్ పోలీసులు, సీసీఎస్ బృందం గాలింపులు చేపడుతున్నారు. అయితే గోవింద్ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన వారు పక్కా ప్రణా ళికతో వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందే రెక్కీ చేసి ఉంటారని పోలీసులు అభిప్రాయపడు తున్నారు. అసలు గోవింద్ ఇంట్లో ఎప్పుడూ భార్య, కదలలేని తల్లి మాత్రమే ఉంటారు. అయితే శనివారం మాత్రం వారిద్దరితో పాటు అన్న భార్య, ఆమె కుమారుడు ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గోవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.పైడపునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.