fee reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:01 AM
fee reimbursement తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎన్.నాగభూషణం, ఎం.యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు
అరసవల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎన్.నాగభూషణం, ఎం.యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నగరంలోని క్రాంతి భవన్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీనివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతు న్నారని కళాశాల యాజమాన్యాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.2,100 కోట్లు, వసతి దీవెన రూ.1,480 కోట్లు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, 77 నెంబరు జీవోను రద్దు చే యాలని కోరారు. లేకుంటే ఈ నెల 30న విజయవాడలో పోరుదీక్ష చేపడతామని హెచ్చ రించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్.రాము, సహాయ కార్యదర్శి హరి, రాజు, ప్రవీణ్, రమేష్‌కుమార్, శ్రీను, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.