తోపుడు బల్లు వ్యాపారుల నిరసన
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:55 PM
:పోలీస్, పంచాయతీ యంత్రాంగం వల్ల తమ బతు కులు వీధిన పడడంతో ప్రత్యామ్నాయం చూపించి ఆదుకోవాలని తోపుడుబల్లు వ్యాపా రులు కోరారు.
టెక్కలి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి):పోలీస్, పంచాయతీ యంత్రాంగం వల్ల తమ బతు కులు వీధిన పడడంతో ప్రత్యామ్నాయం చూపించి ఆదుకోవాలని తోపుడుబల్లు వ్యాపా రులు కోరారు. ఈ మేరకు తోపుడుబల్లుపై చిరువ్యాపారాలు చేసుకునే వారు ఇందిరాగాంధీ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ హించారు.అనంతరం అక్కడ నిరసన తెలిపి, తమ సమస్యలను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి వివరించారు.కార్యక్రమంలో చిన్నమ్మడు, సీత, మల్లి, నీలవేణి, వరదరాజులు, మాధవరావు, సీపీఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్యలు పాల్గొన్నారు.