Share News

పోలీసు అమరవీరులకు జోహార్లు

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:44 AM

అమర వీరు ల త్యాగాలను స్మరి స్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వ ర్వంలో జిల్లా పోలీ సు కార్యాలయం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు.

పోలీసు అమరవీరులకు జోహార్లు
నగరంలో కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్తున్న పోలీసులు

- నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

శ్రీకాకుళం క్రైమ్‌, ఆక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అమర వీరు ల త్యాగాలను స్మరి స్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వ ర్వంలో జిల్లా పోలీ సు కార్యాలయం నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. డీఎస్పీ వివేకా నంద ఎస్పీ కార్యాల యంలో ప్రారంభించ గా, పోలీసులు కవా తు చేసుకుంటూ డే అండ్‌ నైట్‌ కూడలి మీదుగా దేశభక్తి గీతాలతో ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగించి మానవ హారంగా అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లాలో అమరవీరుల స్మారకోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్టు డీఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వ్యాస రచన పోటీలు, వైద్య శిబిరాలు, ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాలు నిర్వహించా మన్నారు. కార్యక్రమంలో సీఐలు అవతారం, ఉమామహేశ్వరరావు, పైడిపునాయుడు, ఆర్‌ఐ నర్సింగరావు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఎన్‌సీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:44 AM