Share News

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:27 PM

సైబర్‌ నేరగాళ్లు రోజుకొక విధానం అనుసరిస్తున్నారని వారిపై అప్రమత్తంగా ఉండాలని డీఐజీ గోపినాథ్‌ జెట్టి అన్నారు. మంగళవారం నరసన్నపేట సీఐ కార్యాల యం, పోలాకి పోలీస్‌ స్టేషన్‌లో వార్షిక తనిఖీ చేపట్టారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ
పోలాకి: మొక్క నాటుతున్న డీఐజీ గోపినాథ్‌ జట్టి

నరసన్నపేట/పోలాకి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు రోజుకొక విధానం అనుసరిస్తున్నారని వారిపై అప్రమత్తంగా ఉండాలని డీఐజీ గోపినాథ్‌ జెట్టి అన్నారు. మంగళవారం నరసన్నపేట సీఐ కార్యాల యం, పోలాకి పోలీస్‌ స్టేషన్‌లో వార్షిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు నుంచి వచ్చిన కాల్స్‌ను నమ్మవద్దని, అప్రమత్తం గా ఉండాలని, వారితో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు నిర్వ హించవద్దని సూచించారు. పోలీసులు, సీబీఐ ఇతర నిఘా సంస్థల వ్యక్తులమంటూ సీన్‌ క్రియేట్‌ చేసి వీడియో కాల్స్‌ చేసినా వాటిని నమ్మవద్దన్నారు. యువత డ్రగ్స్‌ బారిన పడకుండా ‘సంకల్పం’ పేరుతో కళాశాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థతో ప్రజలతో మరింత మమేకమవుతా మన్నారు. అంతకు ముందు పోలీసు క్వార్టర్లను పరిశీలించారు. పోలాకి మండలం వనవిష్ణుపురంలో జరిగిన హత్యపై డీఐజీ ఆరా తీశారు. గతంలో పోలాకి స్టేషన్‌ నుండి రెండు సైబర్‌కేసులు నమోదయ్యాయని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఉంటున్న వారి జాడ తెలుసుకుని వారికి నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. అనంత రం స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమం లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, నరస్నపేట సీఐ శ్రీనివాసరావు, నరసన్నపేట, పోలాకి, సారవకోట ఎస్‌ఐలు దుర్గాప్రసాద్‌, రంజిత్‌కుమార్‌, అనిల్‌కుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.

సైబర్‌ మోసాలపై 1930కి ఫోన్‌ చేయండి

పోలాకి/శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఎవరైనా సైబర్‌ మోసాలకు గురైనప్పుడు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1930లో సంప్రదించాలని డీఐజీ గోపినాథ్‌ జట్టి సూచించారు. పోలాకిలో విలేక రులతో మాట్లాడుతూ.. నేరం జరిగిన కొద్ది గంటల్లో ఈ నెంబరుకు ఫోన్‌ చేయడం ద్వారా తప్పక న్యాయం జరుగుతుందన్నారు. నేషనల్‌ కస్టమర్‌ హెల్ప్‌లైన్‌ 1800-11-4000, సైబర్‌క్రైం. జిఓవి. ఇన్‌లోనూ ఫిర్యాదు నమోదు చేయాలని, అలాగే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వివరాలను అందించాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు వయసులో ఉన్న వారిని, ప్రత్యేకంగా వృద్ధులను సులభంగా టార్గెట్‌ చేస్తున్నా రన్నారు. మీ మొబైల్‌ నెంబర్‌ అక్రమ కార్యకలా పాలకు సంబంధించినదని, టీఆర్‌ఏఐ నుంచి సేవలు నిలిపి వేస్తామని చెప్పి మోసం చేస్తారని, అసలు టీఆర్‌ఏఐ సంస్థ ఎటువంటి సేవలు నిలిపివేయదని, కేవలం టెలి కాం సంస్థలు మాత్రమే సేవలను నిలిపివేస్తాయన్న విషయాన్ని ప్రజలు గుర్తెరగాలన్నారు. ఈకేవైసీ కోసం ఏ బ్యాంకులు లింకులను పంపరని, అటు వంటివి ఏవైనా వస్తే వెంటనే బ్యాంకులను సంప్రదించా లన్నారు. అధిక లాభాలకు ఆశపడి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడ వద్దని డీఐజీ గోపినాథ్‌ జెట్టి సూచించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:27 PM