విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:20 AM
దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంజనీర్ల పాత్ర కీలకమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
అరసవల్లి: దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంజనీర్ల పాత్ర కీలకమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజ నీర్స్, శ్రీకాకుళం అధ్యక్షుడు ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. తొలుత విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో ఇంజనీర్స్ వి.సుధాకర రావు, పి.శ్రీహరి, వీవీ నరసింహారావు, సీహెచ్ రమేష్, ఐ.సత్యనారాయణరాజు, ఎం.వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
భరతజాతి ముద్దుబిడ్డ..
అరసవల్లి: భారతజాతి గర్వించదగ్గ మహనీ యుడు, ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఇంజనీర్‌గా దేశ పేరు ప్రఖ్యాతులను ప్రపంచం నలుదిశలా చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అరసవల్లిలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా వెల్ఫేర్ ఇంజనీర్స్ టెక్నికల్ అసోసియే షన్ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య జయంతి ఆదివారం నిర్వహించారు. తొలుత విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో ముని శ్రీనివాస్, దుంగ సుధాకర్, విజయకుమా ర్, సతీష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
గాంధీ మందిరంలో..
శ్రీకాకుళం కల్చరల్: బలగలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరంలో మోక్షగుండం విశ్వశ్వరయ్య జయంతి సందర్భంగా విగ్రహదాత హారిక ప్రసాద్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాండ్రంగి శ్రీనివాసరావు, పైడి హరినాథ్, నరసింహమూర్తి పాల్గొన్నారు.
ముందడుగు వేయాలి
ఎచ్చెర్ల: దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవల స్ఫూర్తితో యువ ఇంజనీర్లు ముంద డుగు వేయాలని ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ అన్నారు. విశ్వేశ్వరయ్య జ యంతి సందర్భంగా ఆదివారం క్యాంపస్‌లో ఇంజనీ ర్స్ డే నిర్వహించారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ పొన్నాడ సుధాకర్‌ను సత్కరించారు. ఏవో రామకృష్ణ, అకడమి క్ డీన్ కొర్ల మోహనకృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి తేజ్‌కిరణ్, సివిల్ ఇంజనీర్ సురేష్, పీఆర్వో మామిడి షన్ముఖ పాల్గొన్నారు. అనంతరం సహాయమిత్ర ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు.
యువత పాత్ర కీలకం
ఎచ్చెర్ల: సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్ అన్నారు. శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల (చిలక పాలెం)లో ఆదివారం నిర్వహించిన ఇంజనీర్స్ డే కా ర్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లా డారు. కళాశాల ఆవరణలో నిర్మించిన బూర్జ్ ఖలీఫా ఆకృతి ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. జలవనరుల శాఖ ఎస్‌ఈ పొన్నాడ సుధాకర్, కొండా రవికుమార్ ను సత్కరించారు. జేఎన్‌టీయూ (విజయనగరం) పాలక మండలి సభ్యుడు దుప్పల వెంకటరావు, క ళాశాల యాజమాన్య సభ్యులు పి.దుర్గాప్రసాద్‌రాజు, జె.హరీష్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ జీటీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. కళాశాల ఆవరణలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.