ఓటు వజ్రాయుధం
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:37 PM
ఓటు వజ్రాయుధమని, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకో వాలని వెలుగు ఏపీఎం తవిటినాయుడు అన్నారు. బసివాడ, అల్లాడ, గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
జలుమూరు: ఓటు వజ్రాయుధమని, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకో వాలని వెలుగు ఏపీఎం తవిటినాయుడు అన్నారు. బసివాడ, అల్లాడ, గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగ వద్దన్నారు. నచ్చిన వారికి స్వేచ్ఛగా ఓటువేసి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, సీసీలు, మహిళాసంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై అవగాహన
సరుబుజ్జిలి: రావివలస గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో స్వయం శక్తి సంఘ మహిళలతో బుధవారం ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీఎం కమలకుమారి తన సిబ్బం ది, రావివలస డ్వాక్రా మహిళలతో కలిసి ఓటు హక్కుపై ప్రజలకు చైతన్యం కల్పించారు.
యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
ఇచ్ఛాపురం: అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని వెలుగు ఏపీఎం సనపల ప్రసాద్ తెలిపారు. బుధ వారం తులసిగాం గ్రామంలో ఓటరు నమోదుపై ప్రజలకు అవగహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఈనెల 15వ తేదీలోగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. శతశాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.