Share News

దారికాచి.. దోపిడీయత్నం

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:45 PM

ఎస్‌ఎంపురం గ్రామ సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పైల విష్ణు పింఛన్‌ డబ్బులు తీసుకు వెళ్తుండగా... ఆ గ్రామ రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు దారికాచి దోపిడికి విఫల యత్నం చేశారు.

దారికాచి.. దోపిడీయత్నం
దాడి నుంచి తప్పించుకున్న విష్ణు

ఎచ్చెర్ల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎంపురం గ్రామ సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పైల విష్ణు పింఛన్‌ డబ్బులు తీసుకు వెళ్తుండగా... ఆ గ్రామ రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు దారికాచి దోపిడికి విఫల యత్నం చేశారు. దీనికి సంబంధించి వివ రాలిలా ఉన్నాయి. ఎస్‌ఎం పురం గ్రామ పంచాయతీలో సామాజిక పింఛన్లు శని వారం పంపిణీ చేసేందుకు ఎచ్చెర్లలోని ఎస్‌బీఐలో రూ.24,60,000 నగదు విత్‌ డ్రా చేశారు. ఆ డబ్బులు ఓ సంచిలో పెట్టు కుని మధ్యాహ్నం 3.40 గంటల సమ యంలో మోటారు బైక్‌పై విష్ణు సచివా లయానికి ట్రిపుల్‌ ఐటీ రోడ్‌లో వెళ్తుం డగా.. అనమిత్ర టౌన్‌షిప్‌కు సమీపంలో 25 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటారు బైక్‌తో వెనుక నుంచి వచ్చి దాడి చేశారు. దీనిని గమనించిన విష్ణు ఒక్క ఉదుటున తన వాహన వేగాన్ని పెంచి ముందుకు దూసుకుపోయాడు. అయినప్పటికీ దుండగలు కూడా అంతే వేగంతో దూసుకువచ్చి విష్ణు కుడి చేతిపై ఇనుప రాడ్‌తో కొట్టారు. అయినా విష్ణు ముందుకుసాగగా.. సమీపంలో గొర్రెల కాపర్లు కనిపించారు. దీంతో ఆ దుండగులు బైక్‌తో వెనుకదిరిగి వెళ్లిపోయారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ విష్ణు బ్యాంకు నుంచి డబ్బులు విత్‌డ్రా చేసి ఎస్‌ఎం పురం రోడ్‌లో వస్తున్నట్టు కదలికలను గమనించిన వ్యక్తులు.. ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న వ్యక్తులే ఈ పని చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ విష్ణు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వి.సం దీప్‌ కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ రోడ్‌లో గల సీసీ కెమెరాల్లో ఏమైనా రికార్డు అయి ఉంటుందేమోనని ఆరా తీస్తున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:45 PM