Don't give in to threats : అండగా ఉంటాం.. బెదిరింపులకు లొంగొద్దు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:05 AM
Don't give in to threats స్వే చ్ఛాయుత వాతావరణంలో అధికారులు ప్రజల కు సేవలందించాలని, ఎవరి బెదిరింపులకు లొంగాల్సిన పనిలేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
- అధికారులకు భరోసా ఇచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే
- ఎంపీడీవోకి పరామర్శ
ఎచ్చెర్ల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్వే చ్ఛాయుత వాతావరణంలో అధికారులు ప్రజల కు సేవలందించాలని, ఎవరి బెదిరింపులకు లొంగాల్సిన పనిలేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఎచ్చెర్ల మండ ల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా, ఇంకా వైసీపీ నేతలు అధికారంలో ఉన్నామన్నభ్రమలో ఉన్నారన్నా రు. మండల స్థాయి అధికారులను బెదిరించి పనులకు అడ్డు తగలాలనుకోవడం సరికాదన్నా రు. నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులకు అం డగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వా మ్యంలో ప్రజలకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో, అధికారులకు కూడా అంతే స్వేచ్ఛ ఉంటుంద న్నారు. ఎంపీడీవోపై దుర్భాషలాడి బెదిరించ డం సరికాదన్నారు. అధికారుల విఽధులకు ఆటంకం కలిగించి, బెదిరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులకు అవమా నం జరిగితే అది ప్రభుత్వానికి జరిగినట్టేనని భావిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమం త్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసు కువెళ్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, జనసేన పార్టీ నేత విశ్వక్సేన్, కూటమి నాయ కులు బెండు మల్లే శ్వరరావు, అన్నెపు భువనే శ్వరరావు, గాలి వెంకటరెడ్డి, సంపతిరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
విధి నిర్వహణలో ఉండగా అస్వస్థతకు గు రైన ఎచ్చెర్ల ఎంపీడీవో హరిహరరావును ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆదివారం పరామ ర్శించారు. నిర్భయంగా విధులు నిర్వహించా లని, మీ వెనుక మీమంతా ఉన్నామని ఎంపీడీ వోకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. స్వేచ్ఛగా, ని బంధనల మేరకు విధులు నిర్వర్తించుకోవాల న్నారు. పరామర్శించినవారిలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, కూటమి నాయకులు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్, గొర్లె లక్ష్మణరావు పాల్గొన్నారు. కాగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను ఈ ఘటనపై అడిగి వివరాలు తెలుసుకున్నారు.