Share News

హెల్మెట్‌ ధారణ తప్పనిసరి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:30 PM

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, దీనివల్ల ప్రమాదాలు జరిగే సమయాల్లో ప్రాణా పాయం నుంచి కాపాడుకోవచ్చని మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి యు.మాధురి అన్నారు.

 హెల్మెట్‌ ధారణ తప్పనిసరి
మాట్లాడుతున్న న్యాయాధికారి యు.మాధురి

పలాస: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, దీనివల్ల ప్రమాదాలు జరిగే సమయాల్లో ప్రాణా పాయం నుంచి కాపాడుకోవచ్చని మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి యు.మాధురి అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శుక్ర వారం సిబ్బందికి హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పిం చారు. ఆమె మాట్లాడుతూ.. మొదటిసారి హెల్మెట్‌ లేకుండా పట్టుబడితే అపరాధ రుసుం, రెండోసారి పట్టు బడితే మరో రకం అపరాధ రుసుం వేయడం జరుగుతుందన్నారు. వాహ నం నడిపే వారంతా అపరాధ రుసుం చెల్లించే ఆలోచన నుం చి బయటపడాలన్నారు కార్యక్రమంలో బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఫయ్యజ్‌ అహ్మద్‌, న్యాయవాదులు జిఎంఎస్‌.అనిల్‌రాజు, బీకే ఆర్‌ పట్నాయక్‌, ప్రభాకర్‌, రజనీ కుమార్‌, రవికుమార్‌, శ్యామ్‌, చిట్టిబాబు, ఆర్టీసీ డీఎం సంతోష్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మైనర్లు వాహనాలు నడిపితే నేరం

జలుమూరు: మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని ఎస్‌ఐ కె.మధుసూదనరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డ్రైవింగ్‌పై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. లైసెన్సు లేకుండా వాహనం నడి పితే వారి తల్లిదండ్రులపై కేసులు నమో దు చేస్తామన్నారు. అలాగే రూ.25 వేలు వరకు జరీమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డి.వేణుగోపాలరావు, దుర్గాప్రసాద్‌, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:30 PM